న్యూయార్క్ : జులై 6వ తేదీన భూమి సగటు ఉష్ణోగ్రత సరికొత్త అనధికార రికార్డు సృష్టించింది. ఈ వారంలో ఇటువంటి మైలు రాయి సాధించడం ఇది మూడవది. ఇప్పటికే అత్యంత వేడిమి నమోదైన రోజులు రెండు గడిచాయి. మంగళ, బుధవారాల్లో భూమి సగటు ఉష్ణోగ్రతలు 62.9 డిగ్రీల ఫారెన్‌హీట్, 17.18 డిగ్రీల సెల్సియస్‌గా నమోదై రికార్డు సృష్టించగా తాజాగా గురువారం ఈ ఉష్ణోగ్రతలు వరుసగా 63 డిగ్రీల ఫారిన్ హీట్, 17.23 డిగ్రీల సెల్సియస్‌కుచేరుకునాుయి. ఉపగ్రహ డేటా, కంప్యూటర్ సిమ్యులేషన్స్‌లను ఉపయోగించి ప్రపంచం పరిస్థితులను లెక్కించే సాధనమైన యూనివర్శిటీ ఆఫ్ మైన్స్ క్లైమేట్ రీ అనలైజర్ నుండి అందిన డేటా ఈ వివరాలను పేర్కొంది. ఈ వారంలో అత్యంత ప్రమాదకరమైన రీతిలో చైనాలోనిజింగ్జింగ్‌లో దాదాపు 110డిగ్రీల ఫారెన్‌హీట్ నమోదవగా, ఇక అంటార్కిటికా వంటి శీతల ప్రాంతంలో కూడా అసాధారణ రీతిలో 8డిగ్రీల ఫారెన్‌హీట్ నమోదైంది. అయితే ఈ డేటాను తాము ధృవీకరించలేమనినేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌ఓఎఎ) శుక్రవారం పేర్కొంది. యూనివర్శిటీ ఆఫ్ మైనే అనాలసిస్ నిర్ధారణను లేదాఅనుసరించిన పద్ధతినిఎన్‌ఓఎఎ నిర్ధారించలేకపోయినా వాతావరణ మార్పుల కారణంగా మనం వేడిమి కాలంలో వునాుమనిఅర్ధమవుతోందనిఎన్‌ఓఎఎ పేర్కొంది. ప్రభుత్వాలు గానీ ప్రైవేటు రంగం గానీ చివరకుప్రజలు గానీ ఎవరూ కూడా వాతావరణ మార్పుల సమస్యను పరిష్కరించేందుకునిబద్ధతతో లేరనిశాస్త్రవేత్త, వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఇంటర్ గవరుమెంటల్ కమిటీ మాజీ చైర్మన్ రాబర్ట్ వాట్సన్ వ్యాఖ్యానించారు.