నిర్వాసితులకు న్యాయం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ

ప్రజాశక్తి-రాంబిల్లి : పోలవరం ప్రాజెక్టు భూనిర్వాసితులకు న్యాయం చేయాలని జరుగుతున్న సిపిఎం పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ రాంబిల్లి మండలం సిపిఎం నాయకులు ఆవిష్కరించారు. సందర్భంగా సిపిఎం రాంబిల్లి మండల నాయకులు జి దేముడు నాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వేలాది ఎకరాలు ఇచ్చిన గిరిజన రైతులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయి అన్నారు. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం న్యాయం చేయాల్సి ఉన్నప్పటికీ, నేటికీ నిర్వాసితులకు పునరావస్తం కల్పించడం లేదని అన్నారు. వరదల్లో ముంపుకు గురైన రైతులకు ఇప్పటికీ ఇల్లు నిర్మించలేదన్నారు. ఈనెల 20 నుండి జూలై 4 వరకు జరుగు పాదయాత్రలో రాష్ట్ర ప్రజానీకం రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్ పవన్ కుమార్, వై రాము, సిహెచ్ నూకన్నా, నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.