
- ఎస్సీ ఎస్టీ జిల్లా మోనాటరింగ్ కమిటీ సభ్యులు బాలకృష్ణ
ప్రజాశక్తి-పాలకోడేరు : గరగపర్రు సాంఘిక బహిష్కరణ ఘటన జరిగి ఏళ్ల గడుస్తుందని ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పరిహారo అందించలేదని దళితులకు రావాల్సిన రైతిలు తక్షణ అందించాలని ఎస్సీ ఎస్టి జిల్లా మొనాటరింగ్ కమిటీ సభ్యులు పొన్నమండ బాలకృష్ణ భీమవరం ఆర్టీవో శ్రీనివాసులు రాజును కోరారు. భీమవరం ఆర్టీవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసుల రాజును భీమవరం డివిజనల్ రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో దళితులపై గతంలో జరిగిన దాడులు, అన్యాయ ఘటనలను ఆర్డీవో దృష్టికి తీసుకు వెళ్లారు. అలాగే జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా వెలివర్రు, గరగపర్రు ఘటనలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి దళితులకు రావాల్సిన రైతులు తక్షణం అందించాలని కోరారు. ప్రభుత్వం నుంచి రాయితీలను త్వరత గతిన అందించే విధంగా కృషి చేయాలని కోరారు.