- విద్యార్థి,ప్రజా సంఘాల డిమాండ్
- తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా.
- తహసీల్దార్ కు వినతిపత్రం అందజేత
ప్రజాశక్తి-బుట్టాయిగూడెం : గిరిజన విద్యాసంస్థల్లోకి విద్యార్థి,ప్రజాసంఘాలు దాతలు స్వచ్చంద సంస్థలు ఎవరు రాకూడదంటూ ఇటీవలే జువైనల్ జస్టిస్ కమిషన్ ఇచ్చిన సర్కులర్ ను తక్షణమే రద్దు చేయాలని విద్యార్థి, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం మండలంలోని విద్యార్థి, యువజన, గిరిజన, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సమావేశం గిరిజన సంఘం మండల అధ్యక్షులు కారం భాస్కర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. విద్యాసంస్థలలోకి సంఘాలు సంస్థల ప్రవేశం నిషేధం ఎత్తివేయాలని, జువైనల్ జస్టిస్ కమిషన్ సర్క్యులర్ ను రద్దుచేయాలని, ప్రభుత్వ నియంత్రత్వ ధోరణి మానుకోవాలని, విద్యాసంస్థల లోకి సంఘాల సంస్థలకు ప్రవేశం అనుమతి ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నానుద్దేశించి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ, పి డి ఎస్ యు మాజీ రాష్ట్ర కార్యదర్శి సరియం రామ్మోహన్ లు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన విద్యాసంస్థలలో అనేక సమస్యలతో విద్యార్దులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గిరిజన విద్యా సంస్థల్లో సమస్యలు పరిష్కారం చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. తల్లిదండ్రులు నెలలో రెండో శనివారం రావాలని కమిషన్ చూసించడం తగదన్నారు. వసతి గృహల్లో పర్మినెంట్ వార్డెన్ లు లేరనీ ప్రతీ సంత్సరం డిప్యూటెసన్ పద్ధతిలో టీచర్లే వార్డెన్ విధులను నిర్వర్తిస్తున్నారన్నారు.అశ్రమ పాటశాలల్లో విద్యార్దులు అనారోగ్య బారిన పడితే తల్లిదండ్రులు వద్దకు పంపుతున్నారనీ ఎ ఎన్ ఏంలు ఉంటే ఆరోగ్యం చేసుకునేవారన్నారు.తక్షణమేఏ ఎన్ ఎం లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన విద్యా సంస్థలలో సిబ్బంది పూర్తి స్థాయిలో లేరని అన్నారు.2018సంర మెనూను ఇప్పటికీ విద్యార్దులకు అందిస్తున్నారని 'నాడు-నేడు 'అంటూనే గత ప్రభుత్వం ఇచ్చిన మెనూను అమలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.గిరిజన విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా విద్యార్థి ప్రజా సంఘాలను రావద్దనడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు.సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడాలనడం మానవ హక్కులు దెబ్బకలిగేలా ఉన్నాయన్నారు. తక్షణమే గిరిజన విద్యాసంస్థలలోకి విద్యార్థి ప్రజా సంఘాలను అనుమతి ఇచ్చేలా జువైనల్ జస్టిస్ కమిషన్ సర్కులర్ రద్దు చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మండల తహసీల్దార్ ఎస్ శారా శాంతి వారికీ అందజేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు కారం రాఘవ పిడిఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు బి వినోద్, పి వై ఎల్ డివిజన్ అధ్యక్షులు కె పోతిరెడ్డి, తగరం బాబురావు, ఆదివాసీ కొండరెడ్ల సంఘం నాయకులు పట్ల రమేష్ కుమార్ రెడ్డి ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు రవ్వా బసవరాజు, దర్ముల వెంకటేశ్వరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం నాగమణి ఏ ఐ కె ఎం ఎస్ నాయకులు కాకడ కన్నారావు, జి రమేష్ బాబు, జి పండు, జి విశ్వనాధ రెడ్డి, జి రమేష్ తదితరులు పాల్గొన్నారు.










