ప్రజాశక్తి-వి కోట : రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు మండలంలోని పాముగానిపల్లి ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులు విద్యార్థులు దినేష్ రెడ్డి ,కీర్తన ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీంద్రనాథరెడ్డి తెలిపారు. గురువారం శ్రీ కాళహస్తి బాలుర ఉన్నత పాఠశాల మైదానం నందు నిర్వహించిన అండర్ 17 స్కూల్ గేమ్స్ పెడరేషన్ ఆధ్వర్యంలో ఖోఖో జిల్లాస్థాయి పోటీలలో పాము గాని పల్లి ఉన్నత పాఠశాల విధ్యార్ధులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైయ్యారని పాఠశాల పి.డి సురేష్ బాబు తెలిపారు.వీరు త్వరలో కాకినాడలో ప్రభుత్వం నిర్వహించే రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారని పీఈటి సురేష్ బాబు తెలిపారు










