
ప్రజాశక్తి-వెదురుకుప్పం: చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగు సచివాలయ జూనియర్ లైన్ మ్యాన్ హరీష్ ( 24) కి ప్రమాదం! యనమలమంద కాలనీ సమీపంలో విద్యుత్ షాక్ కు గురై ఆదివారం మృతి చెందారు. చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. రుయాలో చికిత్స పొందుతూ మరణించారని గ్రామస్తులు చెప్పారు. మృతుకి తల్లి తండ్రి, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. కుటుంబ పెద్దది దిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది.