Nov 17,2023 11:44

ప్రజాశక్తి - ఎస్ఆర్ పురం : షార్ట్ సర్క్యూట్తో ద్విచక్ర వాహనం దగ్ధమైన ఘటన ఎస్ఆర్ పురం మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు... శుక్రవారం  చిత్తూరు జిల్లా  ఎస్ఆర్ పురం మండలంలోని చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారి ప్రక్కన లక్ష్మీపురం నయారా పెట్రోల్ బంక్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా ద్విచక్ర వాహనం దగ్ధం అయింది. పెట్రోల్ బంకు వద్ద మంటలు  చెలరేగడంతో  పెను ముప్పు తప్పింది. పెట్రోల్ బంకు సిబ్బంది, స్థానికులు వెనువెంటనే మంటలను అదుపు చేయడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.