Jan 09,2023 15:59

ప్రజాశక్తి-బుట్టాయగూడెం : గిరిజన సంక్షేమ అధికారులు ఇచ్చిన సర్కులర్ ను వెంటనే రద్దు చేయాలని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సోమవారం ఐటిడిఏ దగ్గర విద్యార్థి ప్రజా సంఘాలు పిడిఎస్ యు, పివైఎల్,  ఏఐకేఎంఎస్, ఎస్ఎఫ్ఐ, గిరిజన సంఘం, ఆదివాసి కొండరెడ్ల సంఘం, ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు., ధర్నాను ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ గిరిజన సంక్షేమ అధికారులు జువైనల్ జడ్జిమెంట్ ఆధారం చేసుకుని గిరిజన ఆశ్రమ పాఠశాలలోకి ఇతరులు ప్రవేశం లేదని సర్కులర్ ను జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సర్కులర్ను వెంటనే రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుకుంటున్నటువంటి మినీ గురుకులాలుగా నడుస్తున్నాయి అన్నారు.   విద్యార్థులకు సమస్యలు ఉంటే విద్యార్థు స్వేచ్ఛగా గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులకు గాని గిరిజన సంక్షేమ అధికారుల దృష్టికి గాని విద్యార్థులు చెప్పి పరిష్కరించుకొని స్థితి లేదని అన్నారు.  విద్యార్థుల సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్ల విద్యా సంస్థలకు దూరమై డ్రాప్ అవుట్స్ గా మారే ప్రమాదం ఉంటుందని అన్నారు.  అందుకే గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు గాని విద్యార్థి సంఘాలు గాని ప్రజా సంఘాలు గాని విద్యాసంస్థలో ఉన్నటువంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ అనుకూల పరిస్థితులను ఆధారంగా పాఠశాల కొనసాగింపు ఉండాలని నాయకులు అన్నారు ధర్నా అనంతరం గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ డిడికి వినతి పత్రం ఇచ్చారు ఇచ్చినటువంటి వినతిపత్రాన్ని పై అధికారులకు పంపిస్తామని హామీ ఇచ్చారు. పి డి ఎస్ యు రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్ రామ్మోహన్,   పి వై ఎల్ డివిజన్ సహాయ కార్యదర్శి టి బాబురావు,  ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు కారం రాఘవ ,   పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు బి వినోద్ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ అంతర్వేది గూడెం ఎంపీటీసీ కొవ్వాసు గోవిందరాజు,  గిరిజన సంఘం మండల నాయకులు కారం భాస్కర్,  ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లెనిన్, ఆదివాసి కొండరెడ్ల సంఘం నాయకులు పట్ల రమేష్ రెడ్డి, ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకులు బసవరాజు తదితర నాయకులు మాట్లాడారు ముందుగా ర్యాలీగా ఐటిడిఏ చేరుకొని ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి ప్రజా సంఘాల నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.