ప్రజాశక్తి-రేపల్లె : కార్మికులకు ఈఎస్ఐ వెద్య సేవలు మెరుగుపరచాలని, రేపల్లె పట్టణంలో ఈఎస్ఐ డిస్పెన్సరీ సెంటర్ ను ఏర్పాటు చేయాలని తాహాసిల్దార్ కార్యాలయం వద్ద సీఐటియు రాష్ట్రకమిటీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించి, తహాసిల్దార్ డి.మల్లికార్జనరావుకి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సమస్య మీద తాహాసిల్దారు గారు సానుకూలంగా స్పందిస్తూ రేపల్లె కేంద్రంగా ఈ ప్రాంతంలో వివిధ రంగాల కార్మికులు, వర్కర్లకు వైద్యసేవలు అందించడం కోసం ఈఎస్ఐ డిస్పెన్సరీ సెంటర్ ఆవసరం గురించి కలెక్టర్ దృష్టికి మరియు కార్మికశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈఎస్ఐ సెంటర్ ఏర్పాటు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్.మణిలాల్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరిశ్రమలో, సంస్థలో పనిచేస్తున్న కార్మికులు లక్షలాది మంది ఈఎస్ఐ పరిధిలోకి వస్తున్నా కార్మికులు ఉన్నారు, కానీ వారికి ఈఎస్ఐ వైద్య సేవలు అందడం లేదు.సరైనటువంటి డాక్టర్లు,మందులు అన్ని విభాగాల వైద్యపరీక్షలు చేయడానికి ఆవసరమైన ల్యాబ్స్ లేవు, కార్మికుల దగ్గర నుంచి ఈఎస్ఐ పేరుతో వసూలు చేస్తున్న డబ్బులు కోట్ల రూపాయలు నిల్వ ఉన్నప్పటికీ, కార్మికులా వైద్యానికి ఖర్చు చేయటానికి ప్రభుత్వానికి చేతులు రావడంలేదనీ అన్నారు. రేపల్లె నియోజకవర్గ కేంద్రంలో ఈఎస్ఐ డిస్పెన్సరీ సెంటర్ లేకపోవటంతో ఎటువంటి ఆనారోగ్యం సమస్యలు వచ్చినా ఈఎస్ఐ కవారేజ్ లేక ప్రైవేట్ హాస్పటల్స్ కి వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు చేయక తప్పటం లేదు. కావున ఈ ప్రాంతంలో కార్మికులకు అందిరికీ ఉపయోగపడేలా ఈఎస్ఐ డిస్పెన్సరీ సెంటర్ రేపల్లె పట్టణంలో ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రేపల్లె తాలూకా రైస్ మిల్ ముఠా, వర్కర్స్ యూనియన్ సీఐటీయూ అధ్యక్షులు వి.సుబ్బారావు, కార్యదర్శి యు.రామకృష్ణ ప్రసాద్, మరియు రైస్ మిల్ కార్మికులు నాంచారయ్య, కొండలు, మల్లేశ్వరరావు, అంకాలు, నరసింహ, రాంబాబు, సిఐటియు నాయకులు కే.ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు.










