Apr 23,2023 16:22

ప్రజాశక్తి---భట్టిప్రోలు : భారత దేశ ముద్దుబిడ్డ లైన స్వామి వివేకానంద, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, శ్రీకృష్ణదేవరాయలు, ఘంటసాల వెంకటేశ్వరరావు భావితరాలకు ఆదర్శప్రాయంగా వారి చరిత్ర తెలుసుకొని స్ఫూర్తిని పొందే విధంగా విగ్రహాలు ఏర్పాటు చేసిన వివేకానంద విగ్రహ సాధన కమిటీ సభ్యులకు అభినందనలు అని రాష్ట్ర సంక్షేమ శాఖ మాత్యులు మేరుగ నాగార్జున అన్నారు. ఈరోజు భట్టిప్రోలు బౌద్ధ స్తూపం ఎదురుగా బౌద్ధ స్తూపం ఎదురుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ఐదు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు వీరితోపాటు బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ దేవినేని మల్లికార్జున రావు గారు ఎంపీపీ దావులూరు లలిత కుమారి జడ్పిటిసి సభ్యులు తిరువీధుల ఉదయభాస్కరి బాలాజీ,  గ్రామ సర్పంచ్ దారా కిరణ్మయి చెన్నయ్య ఎంపీటీసీ కౌతరపు పద్మావతి, బండారు కుమారి శ్రీనివాసరావు , సత్యనారాయణ మూర్తి , ఉమామహేశ్వరరావు, బి ఎస్ ఆర్ హేమ శంకర్రావు, రామకోటేశ్వరరావు,లీలా మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు