Nov 02,2023 11:43

 

శ్రీకాకుళం, పలాస లో మాట్లాడుతున్న సిపిఎం సీనియర్ నేత మంతెన సీతారాం

 

 

కోటబొమ్మాళి

నవంబర్‌ 2 (గురువారం) ఉదయం శ్రీకాకుళం జిల్లా మందసలో 'ప్రజా రక్షణ భేరి' మూడో బస్సు యాత్ర ప్రారంభమైంది. మందస నుండి మధ్యాహ్నానికి బస్సు యాత్ర కోటబొమ్మాళికి చేరుకుంది.

*****************************************************************************

viju krishnan2

బిజెపి విషకౌగిలి నుంచి వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు బయటకు రావాలి : విజుకృష్ణన్ 

ప్రజాశక్తి పలాస  : వినాశకర బిజెపి విషకౌగిలి నుంచి వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు బయటకు రావాలని సిపిఎం అఖిలభారత నాయకులు విజుకృష్ణన్ అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజారక్షణ భేరి బస్సు యాత్రను మందసలో ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా వీరగున్నమ్మ స్థూపానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మందసలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. బహిరంగ సభలో విజుకృష్ణన్  మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజి, కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు, విశాఖ రైల్వే జోన్ వంటి విభజన హామీలలో ఏ ఒక్కటీ అమలు కాలేదు. రాష్ట్ర ప్రజల్ని నిలువునా మోసం చేసిన బిజెపి అంతటితో ఆగకుండా మన రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి గుండెకాయ లాంటి విశాఖ ఉక్కును తెగనమ్మడానికి తయారైంది. బిజెపి పాలనలో మొత్తం దేశమే అస్తవ్యస్తంగా తయారైందని విమర్శించారు. బిజెపి బుల్డోజర్ రాజకీయాలతో అన్నదమ్ముల్లా సమైక్యంగా మెలగవలసిన ప్రజల మధ్య విద్వేషాలు రాజేస్తోందని అన్నారు. కోట్లాది మంది కార్మికుల హక్కులను కాలరాసే లేబర్ కోడ్ లను తెచ్చిందని అన్నారు. ప్రభుత్వ రంగాన్ని తెగనమ్ముతూ, ప్రజల ఆస్తుల్ని అంబానీ, అదానీలకు తేరగా దోచిపెడుతోందని, అదానీ కన్నంలో దొంగలాగా దొరికిపోయినా వెనకేసుకువస్తోందని అన్నారు. అర్ధాకలితో బతుకుతున్నవారు ప్రపంచంలోకెల్లా అతి ఎక్కువమంది మన దేశంలోనే ఉన్నారంటే అది మోడీ పాలన పుణ్యమేనని విమర్శించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, మంతెన సీతారాం, బి తులసీదాస్ మాట్లాడుతూ జీడికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మద్దతు ధర ప్రకటించడం లేదని ప్రశ్నించారు. జీడికి మద్దతు ధర విషయంలో టిడిపి తన వైఖరి సృష్టం చేయాలని డిమాండ్ చేసారు. ఎక్కడెక్కడ నుండో వచ్చిన వారు తప్పుడు పత్రాలు సృష్టించి గిరిజనులు భూములు ఆక్రమించుకుంటుంటే స్థానిక మంత్రి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. 
రాష్ట్ర ముఖ్యమంత్రి కార్పొరేట్ సేవలో తరిస్తున్నారని విమర్శించారు. కృష్ణ పట్నం, గంగవరం మేజర్ పోర్టులతో బాటు మూలపేట పోర్టు, రాష్ట్ర ప్రజల సంపదను ఒక్కొక్కటిగా ఆదానికి నైవేధ్యం పెడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ద్రోహం చేసి విభజన హామీలకు ఎసరు పెట్టినా కేంద్రాన్ని పల్లెత్తు మాట అనే ధైర్యం లేదా అని అన్నారు. వైసీపీ ప్రభుత్వ విద్యా విధానంతో ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులు నామమాత్రంగా తయారవడంతో కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీకి సామాన్యులు బలైపోతున్నారు. లక్షలాది ప్రభుత్వోద్యోగులకు, ఉపాధ్యాయులకు పెన్షన్ విషయంలో ఇచ్చిన హామీని తుంగలో తొక్కి జి.పి ఎస్ పేరుతో మోసం చేసింది. అంగవ్వాడీలకు, అశాలకు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు చేసిన వాగ్దానాలన్నీ గాలికెగిరిపోయాయి. పెరిగే ధరలు, నిరుద్యోగం, గిట్టుబాటు లేని వ్యవసాయం, రక్షణ కరువైన చేతివృత్తులు, కౌలురైతులు ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదని విమర్శించారు. కరెంట్ ఛార్జీలు, ఇసుక ధరలు ప్రభుత్వమే పెంచి ఉపాధిని దెబ్బ తీస్తున్నారని, చిన్న పరిశ్రమలు మూతబడుతున్నాయని అన్నారు. వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని, నిరసనను కూడా తెలియజేయడానికి వీలు లేకుండా నిర్బంధాలు, ముందస్తు అరెస్టులు, బైండోవర్ కేసులు బనాయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టిడిపి రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయం గురించి పల్లెత్తుమాట అనకపోగా పార్లమెంట్లో బిజెపిని బలపరుస్తోందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని పోర్టుల్ని అదానీ పరం చేసినా, విద్యుత్ చార్జీలను భారీగా వడ్డిస్తున్నా, ఉద్యోగుల పెన్షన్ కి ఎసరు పెట్టినా, చంద్రబాబు నోరువిప్పడం లేదని అన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజల కోసం ప్రత్య విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్తుందని వారన్నారుఈ బహిరంగ సభకు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు అధ్యక్షత వహించారు. ఈ బస్సు యాత్రలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.వి.నాగేశ్వరరావు, డి.ధనలక్ష్మి, ఎం హరిబాబుజిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు, నాయుకులు చర్ల ప్రసాదు అజయ్ కుమారప్రాతిని కృష్ణమూర్తి, ఎన్.గణపతి, దిలీప్ కుమార్జు, ట్టు సింహాచలం తదితరులు పాల్గొన్నారు. ప్రదర్శన అగ్ర భాగాన కళాకారులు ఆటపాటలతో ఆకట్టుకున్నారు

viju 3

 

viju 4