ప్రజాశక్తి-నందిగామ : జగన్న ఇళ్ళ నిర్మాణాలు వేగ వంతం చేయాలని నందిగామ ఆర్డిఓ రవీంధ్ర రావు పేర్కొన్నారు. శనివారం జగనన్న హోసింగ్ కాలనీలో గల లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంనందు లబ్ధిదారులతో నందిగామ ఆర్డిఓ మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సమావేశం ను కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామము నందు మరియు నందిగామ మండలం అడవిరావులపాడు గ్రామములో లబ్ధిదారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం నందు హోసింగ్ డిఇఇ కె.వీరభద్రరావు, నందిగామ తహశీల్ధార్ నరసింహారావు, నందిగామ ఎంపిడిఓ శ్రీనివాసరావు కంచికచర్ల, శైలజ నందిగామ కంచికచర్ల, ఆర్డబ్లుఎస్ ,డిఇఇ,ఎఇ, నందిగామ , కంచికచర్ల , గ్రామ సర్పంచులు పాల్గొన్నారు.










