ప్రజాశక్తి - ముద్దనూరు : స్థానిక అప్ గ్రేడ్ పోలీస్ స్టేషన్ సోమవారం జిల్లా ఎస్పీ సిద్ధార్డ్ కౌశిల్ తనిఖీ చేశారు.రికార్డులు తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో డిఎస్పీ నాగరాజు, సిఐ నరేష్ బాబు, ఎస్ఐ చంద్ర మోహన్,సిబ్బంది పాల్గొన్నారు.










