Oct 10,2023 16:00

ప్రజాశక్తి-ముద్దనూరు(కడప): మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు నియోజకవర్గ స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు రాజబాబు, పిడి మాధవ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జమ్మలమడుగు పీఆర్‌ పాఠశాలలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీల్లో విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు. బాలుర విభాగంలో అండర్‌-14 డబుల్స్‌ చక్రధర్‌, సింగిల్స్‌ నరేంద్ర, అండర్‌-17 డబుల్స్‌ జయంత్‌, సింగిల్స్‌లో వెంకటేష్‌ అత్యంత ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. యోగ మాస్టర్‌ రాంకుమార్‌ విద్యార్థులను అభినందించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.