Jul 08,2023 11:43

ప్రజాశక్తి-బి.కొత్తకోట(అన్నమయ్యజిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్‌ రఫిక్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. శనివారం బి.కొత్తకోట పట్టణంలోని సచివాలయం-4 పరిధిలోని సిబ్బందితో కలిసి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ అకౌంట్‌ ఆఫీసర్‌ బి.రమాదేవి మాట్లాడుతూ... ప్రజా సమస్యల పరిష్కారమే జగనన్న సురక్ష కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి సమస్యల తక్షణ పరిష్కారానికి కృషి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఇందుకు గృహసారథులు, వాలంటీర్ల సహకారం తీసుకోవాలన్నారు. ఇప్పటికే పట్టణంలో ఈ కార్యక్రమాన్ని అధికారులు, సిబ్బంది నిర్వహిస్తున్నారన్నారు. సమిష్టి కృషితో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం కన్వీనర్లు కంచి కళ్యాణ్‌ కుమార్‌ రెడ్డి, సిఆర్‌ చిన్నికష్ణ, హౌసింగ్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు కంచి సురేందర్‌ రెడ్డి, విఆర్‌ఓ హైదర్‌, వెల్ఫేర్‌ శ్రీనివాసులు, నగర పంచాయతీ సిబ్బంది, రెండో సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.