* రాజీనామా యోచనలో అజేయ కల్లాం, పివి రమేష్
* సిఎంఓలో సీనియర్ల మధ్య 'పంపకాల' వివాదం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి
ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారాల పంపకాల వివాదం గాలివానగా మారుతోరది. పదవీ విరమణ చేసిన తరువాత కూడా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అజేయకల్లాం, పి.వి రమేష్‌లను అకస్మాత్తుగా పక్కనపెట్టి ఇతర అధికారులకు ఆ బాధ్యతలు అప్పగిరచడం వివాదానికి తెరలేపిరది దీంతో మనస్థాపానికి గురైన ఆ ఇద్దరు తమ పదవులకు త్వరలోనే రాజీనామా చేయనున్నట్లు విశ్వసననీయంగా తెలిసింది. నిజానికి గత ఆరు నెలలుగా కల్లాం, రమేష్‌ల ప్రాథాన్యం ముఖ్యమంత్రి కార్యాలయంలో తగ్గుతోంది. కొన్ని సందర్భాల్లో వారు తెచ్చిన ఫైళ్లను చూడటానికి ముఖ్యమంత్రి నిరాకరిస్తున్నారని, మరో సీనియర్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్‌కు చూపించాలంటున్నారని ఇతర అధికారులు చెబుతున్నారు. ప్రవీణ్ ప్రకాశ్ ముఖ్యమంత్రి పేషీతోపాటు, సాధారణ పరిపాలన శాఖలో ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు తీసుకోవడంతోనే ఈ మార్పులు ప్రారంభమయ్యాయని అంటున్నారు. తాజాగా కల్లాం, రమేష్‌ల శాఖలను ఇతర అధికారులకు బదిలీచేస్తూ జారీ అయిన ఉత్తర్వులు కూడా ఆయన సంతకంతోనే జారీ అయ్యాయి. ప్రస్తుతం కల్లాం, రమేష్ చేతుల్లో ఒక్క శాఖ కూడా లేదు. ఈ నేపథ్యంలో సిఎం పేషీలో ఇంకా కొనసాగడం మంచిదికాదన్న అభిప్రాయానికి వారిద్దరు వచ్చినట్లు తెలిసింది. ఢిల్లీ నుండి వచ్చిన ప్రవీణ్ ప్రకాశ్‌కు బిజెపి అగ్రనేతల ఆశీస్సులు పుష్కలంగానే ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో ఇటీవల రాష్ట్ర విద్యుత్ రంగంపై కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ చేసిన విమర్శలకు అజేయకల్లాం సమాధానమిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై 'ఉద్యోగ విరమణ చేసిన బ్యూరోక్రాట్ కేంద్రమంత్రికి సమాధానమిస్తారా..?' అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.










