
210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. మధుశంక వేసిన బౌలింగ్‌లో 11 పరుగులు చేసిన వార్నర్, స్మిత్ డక్‌ఔట్‌గా పెవిలియన్‌కు చేరారు. ప్రస్తుతం మిచెల్‌మార్ష్ 36 బంతుల్లో 46 పరుగులు, మార్నస్ లాబుషేన్ 10 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్నారు.
- శ్రీలంక 209 అలౌట్
లక్నోలోని ఎఖానా స్టేడియం వేదికగా శ్రీలంక-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో శ్రీలంక 209 పరుగులకు అలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన శ్రీలంక ముందు శ్రీలంక ఓపెనర్లు పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. పతుమ్ నిస్సంక 67 బంతుల్లో 8 ఫొర్ల సాయంతో 61 పరుగులు చేయగా.. కుశాల్ పెరీరా 82 బంతుల్లో 72 పరుగులు చేశాడు. వీరిద్దరిని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఔట్ చేయగా ఆ తరువాత క్రీజులోకి వచ్చిన కుశాల్ మెండిస్ 9, సదీర సమరవిక్రమ 8 పరుగులు చేసి నిరాశ పరిచారు. వీరిద్దరిని ఆడమ్ జంపా పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో 32.1 ఓవర్ దగ్గర్ వర్షం ఆటంకం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. వర్షం నిలిచిన తరువాత ఆస్ట్రేలియా బౌలర్లు చేలరేగిపోయారు. వరుసగా వికెట్లు తీస్తూ శ్రీలంకను భారీ స్కోరు చేయకుండా ఆడ్డుకున్నారు. చరిత్ అసలంక 25, ధనంజయ డి సిల్వా 7, చమిక కరుణరత్నే 2, దునిత్ వెల్లలగే 2, మహేశ్ తీక్షణ 0, లహిరు కుమార 4, దిల్షన్ మధుశంక 0 పరుగులు చేసి నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 4, స్టార్క్, కమిన్స్ తలో రెండు వికెట్లు తీయగా మ్యాక్స్‌వెల్ 1 వికెట్ తీసుకున్నాడు.
- వర్షంతో ఆగిన మ్యాచ్.. శ్రీలంక 178/4
32 ఓవర్లు పూర్తయ్యే సరికి శ్రీలంక 4 వికెట్లు నష్టపోయి 178 పరుగులు చేసింది. ఈ క్రమంలో వర్షం మ్యాచ్ అంతరాయం కల్పించడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. అంతకు ముందు శ్రీలంక ఓపెనర్లు పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. పతుమ్ నిస్సంక 67 బంతుల్లో 8 ఫొర్ల సాయంతో 61 పరుగులు చేయగా.. కుశాల్ పెరీరా 82 బంతుల్లో 72 పరుగులు చేశాడు. వీరిద్దరిని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఔట్ చేయగా ఆ తరువాత క్రీజులోకి వచ్చిన కుశాల్ మెండిస్ 9, సదీర సమరవిక్రమ 8 పరుగులు చేసి నిరాశ పరిచారు. వీరిద్దరిని ఆడమ్ జంపా పెవిలియన్‌కు పంపాడు. ప్రస్తుతం క్రీజులో చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా క్రీజులో ఉన్నారు.
- 13 ఓవర్లకు శ్రీలంక 70/0
13 ఓవర్లు పూర్తయ్యే సరికి శ్రీలంక వికెట్ నష్టపోకుండా 70 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా ఆసీస్ బౌలర్లను దాటిగా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం పతుమ్ నిస్సంక 37 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 31 పరుగులు , కుశాల్ పెరీరా 41 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 34 పరగులు చేశారు. మరోవైరు ఆసీస్ బౌలర్లు వికెట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
- 10 ఓవర్లు పూర్తి.. శ్రీలంక 51/0
10 ఓవర్లు పూర్తయ్యే సరికి శ్రీలంక 51 పరుగులు చేసింది. ఓపెనర్లు పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా అచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం పతుమ్ నిస్సంక 27 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 22 పరుగులు , కుశాల్ పెరీరా 33 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 24 పరగులు చేశాడు.
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
లక్నోలోని ఎఖానా స్టేడియం వేదికగా శ్రీలంక-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో లంక కెప్టెన్‌గా కుశాల్ మెండిస్ వ్యవహరిస్తున్నాడు. కాగా శ్రీలంక రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. గత మ్యాచ్‌లో ఆడిన దసున్ షనక, మతీష పతిరణ స్థానాల్లో చమిక కరుణరత్నే, లహీరు కుమార జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్‌లో కోసం ఆసీస్ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది.
తుది జట్లు..
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్‌కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్
శ్రీలంక: పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(కెప్టెన్/వికెట్‌కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, లహిరు కుమార, దిల్షన్ మధుశంక