Jan 25,2023 14:55

ప్రజాశక్తి - ఏలూరు : కేంద్ర ప్రభుత్వంకు  ఏటా లక్షల కోట్ల రూపాయలు ఎల్ ఐ సి డివిడెంట్లూ ఇస్తుంటే ప్రభుత్వం ఎల్ ఐ సి ని అమ్మెస్తుందని టీచర్స్ ఎం ఎల్ సి షేక్ సాబ్జీ అన్నారు. ఎల్ ఐ సి ఎజేంట్స్ ఆర్గనైజేషన్ (AOI) ఏలూరు బ్రాంచి యూనియన్ మహాసభ బుధవారం స్థానిక సీఐటీయూ పాత భవనంలో యూనియన్ అధ్యక్షులు పి రాంప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత కాంగ్రెస్ ప్రభుత్వం కంటే వేగంగా  ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణ విధానాలు అమలు చేస్తున్నదని అన్నారు. ప్రభుత్వ ఆస్తులన్నీ అదానీ, అంబానీలుకు కట్టబెడుతున్నారని అన్నారు. అందుకే కరోనా సమయంలో కూడా అంబానీ, అదానీ ఆస్తులు 100 రెట్లు అధికంగా పెరిగాయి అన్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు టీ కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి జి రవికిషోర్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏలూరు బ్రాంచి యూనియన్ సభ్యత్వం, కార్యకలాపాలు సాగిస్తున్న దానిలో ముందున్నది అన్నారు. సభలో ముందుగా ఏలూరు యూనియన్ కార్యదర్శి తాళం సురేష్ కార్యదర్శి రిపోర్టు ప్రవేశ పెట్టారు. కోశాధికారి వైయస్ కనకరావు యూనియన్  అకౌంట్ వివరాలు తెలిపారు.