
ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం కొడమంచిలి గ్రామంలో రైతు సంఘం కార్యాలయంలో సర్దార్ కాటన్ వర్ధంతి వేడుకలు మండల సర్పంచుల ఛాంబర్ అధ్యక్షులు సుంకర సీతారాం అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దవళేశ్వరం బేరేజ్ వద్ద ఒక్క అనకట్ట కట్టి లక్షలాది ప్రజల తలరాతని మార్చవచ్చని నిరూపించిన దార్శినీకుడు గోదావరి జిల్లాల ప్రదాత, ఉభయ గోదావరి జిల్లాల ప్రజల ఆశాజ్యోతి,అపర భగీరధుడు కాటన్ దొర అని అన్నారు. అటువంటి మహానుభావులకు నివాళులు అర్పించడం గొప్పధన్యం అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ అధ్యక్షులు మన్నె సుబ్బారావు సొసైటీ అధ్యక్షులు కాండ్రేగుల సత్యనారాయణ మాజీ ఏఎంసి డైరెక్టర్ కొల్లేపర సాయిబాబ రైతు సంఘ సభ్యులు మన్నె నాగేశ్వరరావు
కాజా రాజా పోలిశెట్టి వనమారాజు, జక్కంశెట్టి వెంకటేశ్వరరావు, చిక్కాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.