
న్యూఢిల్లీ : సింగపూర్ ఓపెన్ 2022 మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో భాతర షట్లర్ పివి సింధు విజయం సాధించింది. చైనా క్రీడాకారిణి వాంగ్ జియూను మట్టి కరిపించింది. తొలి రౌండ్‌లో సింధు విజయం సాధించగా (21-9), రెండవ గేమ్‌లో (21-11) ఓడిపోయింది. మూడవ సెట్‌లో పుంజుకున్న సింధు చైనా క్రీడాకారిణిపై పైచేయి సాధించి(21-15).. విజయాన్ని సొంతం చేసుకుంది.