న్యూఢిల్లీ/ఒట్టావా : నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించవద్దని ఖలిస్థానీ ఉగ్రవాది నిషేధిత సిక్స్ ఫర్ జస్టీస్ (ఎస్‌ఎఫ్‌జె) అధ్యక్షుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరించారు. 'నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దని సిక్కు ప్రజలను కోరుతున్నాం. ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ ఇండియాను దిగ్బంధిస్తాం. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దు. లేదంటే మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది' అని పన్నూన్ విడుదల చేసిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
నవంబర్ 19న ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం మూసివేస్తారని పన్నూన్ తెలిపారు. భవిష్యత్తులో ఆ విమానాశ్రయం పేరు కూడా మారుతుందని అన్నారు. నవంబర్ 19న ప్రపంచ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతుందని అన్నారు.
ఎస్‌ఎఫ్‌జె అధ్యక్షుడు గురుపత్వంత్ గతంలోనూ బెదిరింపులకు పాల్పడ్డారు. హిందూ కెనడియన్స్ కెనడాను వీడాలని సెప్టెంబర్‌లో హెచ్చరించిన సంగతి తెలిసిందే.