Oct 16,2023 14:07
  • కే.గంగవరం  ఎస్.ఐ.షేక్ జానీ భాష 

ప్రజాశక్తి-కె.గంగవరం : దసరా సెలవులు సందర్భంగా వేరే గ్రామాలకు వెళ్లె కుటుంబాల వారు  విలువైన బంగారు, వెండి, నగదును సాధ్యమైనంత వరకు బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని, ఇంటికి తాళం వేసుకోవాలని కే గంగవరం ఎస్. ఐ. షేక్ జానీ భాష విజ్ఞప్తి చేశారు.  ఊరికి వెళ్లేవారు పోలీసుస్టేషన్ లో  సమాచారం ఇవ్వాలని  ఆయన తెలిపారు. దసరా సెలవుల నేపథ్యంలో వేరే ప్రాంతాలకు వెళ్ళే ప్రజలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఊళ్లకు వెళ్లే వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇళ్ళకు తాళం వేసి సొంత గ్రామాలకు వెళ్లే  వారు తమ ఇళ్ళల్లో బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, డబ్బులు ఉంచవద్దని తెలిపారు. ఇళ్ళకు తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళే వారు ముందస్తుగా సమీప పోలీసు స్టేషన్ లో సమాచారం అందించాలన్నారు. దొంగతనాలు జరగకుండా గస్తీ పోలీసులు ఆయా ప్రాంతాలలో రాత్రి వేళ ప్రత్యేక నిఘా ఉంచుతామని వివరించారు. కొందరు తమ బ్యాగుల్లో  నగదు, బంగారు, ఇతర ఆభరణాలను ఉంచుకుని  బస్సుల్లో ఇతర వాహనాలలో ప్రయాణం చేసే సమయంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు పాటించాలి.అత్యవసర సమయాలలో డయల్ 100 లేదా 112 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఎస్సై సూచించారు.