గగన తలానికెగసి
సూర్యుని తాపాన్ని సైతం
లెక్క చేయక దూసుకెళ్ళే డేగలా
ఈ ప్రపంచమంత చుట్టి రావాలని అనుకోవాలి ..!
ప్రవాహం ఎంత తీవ్రమైనా
ఏటికి ఎదురెల్లే చేపలా
సమస్య ఏదైన ఎంతటిదైనా
పరిష్కారం దిశగా ఎదురెళ్లాలని అనుకోవాలి ..!
ఓటమిని అంగీకరించని
వీర సైనికునిలా యుద్ధరంగంలో
వెనకడుగు వేయని యోధునిలా
అలుపెరుగక సాగిపోవాలని అనుకోవాలి ..!
శక్తి యుక్తి నీవై ధీరోదాత్తుడిగా
కలలు కన్న కళను వెలికి తీసి
తమదైన ముద్ర వేసుకోవాలని అనుకోవాలి ..!
సాధనతో సాధ్యం కానిది ఏదీ లేదని
సమస్తాన్ని జయించవచ్చని
అనుకొంటే కానిది ఏమున్నది!
మనిషి అనుకొంటే
సాధించలేని దేమున్నది అని అనుకోవాలి ..!
- లక్ష్మి శ్రీనివాస్
96766 01192










