Oct 05,2023 10:18

ఢిల్లీ: భారత సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్‌, అతడి మాజీ భార్య ఆయేషా ముఖర్జీకి ఢిల్లీ కోర్టు బుధవారం విడాకులు మంజూరు చేసింది. 2012లో ప్రేమ వివాహం చేసుకున్న ఇరువురికి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కాంప్లెక్స్‌లోని ఫ్యామిలీ కోర్టు విడాకులను ఆమోదించింది. 2021లో విడాకుల గురించి ఆయేషా సోషల్ మీడియా పోస్ట్‌లో చేసిన విషయం విదితమే. ఈ కేసు తాజాగా కోర్టులో విచారణకు రాగా, తన భార్యపై ధావన్‌ చేసిన ఆరోపణలు వాస్తవమైనవని న్యాయమూర్తి హరీష్ కుమార్ అంగీకరించారు. కుమారుడితో విడిగా ఉండాలని ఆయేషా ఒత్తిడి చేయడంతో.. ధావన్ మానసిక వేదనకు గురయ్యాడని న్యాయమూర్తి పేర్కొన్నారు. ధావన్‌కు భారత్‌ లేదా ఆస్ట్రేలియాలో తన కుమారుడిని కలవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. వీడియో కాల్‌ ద్వారా కూడా తన కుమారుడితో మాట్లాడవచచ్చని తెలిపింది.