Jun 20,2022 16:21

రెండు దశాబ్దాల పాటు భారత మహిళా క్రికెట్‌కు అసాధారణమైన సేవలు అందించి, ఇటీవల రిటైర్మెంట్‌ ప్రకటించిన ప్రముఖ క్రికెటర్‌ మిథాలీరాజ్‌. ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకొని బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రం 'శభాష్‌ మిథు'. శ్రీజిత్‌ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో తాప్సీ పన్ను టైటిల్‌ రోల్‌ పోషించారు. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. చిన్నతనం నుంచి క్రికెటర్‌ కావాలని మిథాలీ పడిన ఆరాటం, క్రికెటర్‌గా ఎదిగే సమయంలో ఎదుర్కొన్న అవమానాలు, మహిళల క్రికెట్‌ గుర్తింపునకు ఆమె పడిన శ్రమ.. తదితర అంశాలన్నీ ఈ సినిమాలో చూపించనున్నట్లు ట్రైలర్‌ ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రం జులై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.