
ఇటీవల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన న్యూజిలాండ్ టెస్ట్ బ్యాట్‌మెన్ రాస్ టేలర్ గురువారం తన ఆత్మకథ పుస్తకం విడుదల చేశారు. తన 16 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో జాత్యంహకారానికి గురయ్యానని ఆయన వెల్లడించారు. సమోవా వారసత్వానికి చెందిన ఆయన.. లాకర్ రూమ్‌కు వెళ్లినప్పుడు కొంత మంది న్యూజిలాండ్ జట్టు అధికారులు తనపై జాత్యాహంకార పూరిత వ్యాఖ్యలు చేస్తూ.. ఎగతాళి చేసేవారని తెలిపారు. బ్లాక్ అండ్ వైట్ పేరుతో రాసిన ఈ పుస్తకంలో 'న్యూజిలాండ్‌లో క్రికెట్ చాలా అందమైన క్రీడ' అంటూ పేర్కొన్నారు. 'నేను గోధుమ రంగులో ఉండేవాడిని, దీంతో సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. న్యూజిలాండ్ క్రికెట్‌లో పసిఫిక్ ద్వీపం నుండి వచ్చే వాళ్లు అరుదు. కాబట్టి నన్ను మావోరీ లేదా భారతీయ వారసత్వానికి చెందిన వాడినని భావించేవారు. లాకప్ రూమ్‌కు వెళ్లినప్పుడు అనుచితంగా మాట్లాడుతూ.. ఎగతాళి చేసేవారు. ఎదురు తిరిగితే.. ఆ సమస్య పెద్దదవుతుందని నాకు తెలుసు. అందుకే మిన్నకుండిపోయాను' అని తన ఆత్మకథలో రాసుకున్నారు. ఇక డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసేవారని, అయితే వాటికి పరిమితి ఉందన్నారు. 'ఓ సహచరుడు నువ్వు సగం గుడ్ బారు' అని అనేవాడు. ఇతర ఆటగాళ్లు చేసిన జాత్యహంకార వ్యాఖ్యలను సహించాల్సి ఉంటుందని తెలిపారు. ఇంకా తన కెరీర్‌లో ఎదురైన అనేక విషయాలను రాస్ టైలర్ ఈ పుస్తకంలో పంచుకున్నారు.