May 01,2023 16:17

ప్రజాశక్తి- రేపల్లె : భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక ఏబిఆర్ కాలేజీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కళాశాల ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. పరీక్ష ఫీజు కట్టించుకోవాలని ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం స్థానిక  తాసిల్దార్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ బాపట్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్య , మనోజ్ మాట్లాడుతూ అటెండెన్స్ సరిపోలేదు అనే కారణంతో విద్యార్థుల వద్ద పరీక్ష ఫీజు కట్టించుకోకపోవడం సరికాదని ముందుగానే విద్యార్థుల వద్ద కాలేజీ ఫీజు కట్టించుకుని ఈరోజు పరీక్ష ఫీజు చివరి రోజు అయిన కూడా పరీక్ష ఫీజు కట్టించుకోకపోవడం ప్రిన్సిపల్ కాలేజీకి రాకపోవడం ప్రిన్సిపల్ విధుల పట్ల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని అన్నారు, విద్యార్థులకు ప్రభుత్వం ఫేస్ అటెండెన్స్ ను తీసుకొస్తే కాలేజీలో మాత్రం ఎక్కడా లేనివిధంగా ప్రతి గంటకు మాన్యువల్ అటెండెన్స్ వేస్తూ మాన్యువల్ అటెండెన్స్ ని పరిగణలోకి తీసుకుని క్లాస్ టీచర్ ఏది చెప్తే అది ప్రిన్సిపల్ వింటూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం మంచి పద్ధతి కాదని అన్నారు, దాదాపు 50 మంది విద్యార్థులకు పైగా ఫీజు కట్టించుకోకుండా నిలిపివేశారని వీరందరి హాజరును సచివాలయంలో తీసుకుంటే సరిపోను ఉందని ప్రభుత్వం కల్పించిన పేస్ అటెండెన్స్ను పరిగణలు తీసుకుని అందరి చేత పరీక్ష ఫీజు కట్టించుకుని సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు, విద్యార్థులు తమ సమస్యను చెప్పుకోవడానికి ప్రిన్సిపాల్ కు వినతి పత్రం అందించిన సందర్భంలో ప్రిన్సిపల్ ముందు కృతజ్ఞతగా నవ్వినందుకు వినతి పత్రాన్ని చించి ముఖం మీద విసిరివేయడం విద్యార్థుల పట్ల ప్రిన్సిపల్ అహంకార వైఖరి మార్చుకుని విద్యార్థులు సమస్యల పరిష్కారం కోసం తన విధులను నిర్వహించాలని అన్నారు విద్యార్థులు సమస్యలు చెప్పుకోవడానికి కూడా కళాశాల ప్రిన్సిపల్ అవకాశం ఇవ్వకపోవడాన్ని అనేక సందర్భాల్లో గమనించామని అపాయింట్మెంట్ తీసుకోవాలని విద్యార్థులకు సూచించడం ప్రజాస్వామ్య హక్కులకు విద్యార్థుల ప్రాథమిక హక్కులను అణచివేయడమేనని విమర్శించారు.  విద్యార్థుల పట్ల నిలబెడుతూ వారి సమస్యల పరిష్కారం కోసం వైస్ ప్రిన్సిపాల్తో శాంతియుతంగా మాట్లాడుతుంటే ఎస్ఎఫ్ఐ నాయకులపై దురుసుగా ప్రవర్తించడం, పబ్లిసిటీ కోసం చేస్తున్నారంటూ అసభ్యకరంగా ప్రవర్తించడం విద్యార్థులు వారి హక్కులను ఏబీఎన్ కాలేజీ బృందం అనగతొక్కుతుందని కాలేజీలో విద్యార్థి సంఘాలు ఉండడం విద్యార్థులకు మరియు కళాశాల స్టాఫ్ కు మంచిదేనని అనేక సందర్భాలలో కాలేజీలో స్టాప్ కు వచ్చే సమస్యల పైన ఎస్ఎఫ్ఐ ముందుండి పోరాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా కళాశాల బృందం ప్రిన్సిపల్ తమ వైఖరిని మార్చుకుని విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉండాలని వారి సమస్యలను వినాలని పరిష్కరించాలని కోరారు. విద్యార్థుల వద్ద వెంటనే పరీక్ష ఫీజు కట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రేపల్లె పట్టణ కార్యదర్శి సూర్య ప్రకాష్, నాయకులు సతీష్ కుమార్ వెంకటేష్ అమర్దీప్, విద్యార్థులు పాల్గొన్నారు.