హనోయ్ : వియత్నాం రాజధాని హనోరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది మరణించినట్లు స్థానిక మీడియా బుధవారం తెలిపింది. ఈ ఘటనలో మరో 54 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారని పేర్కొంది. మంగళవారం అర్థరాత్రి సమయంలో అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయని.. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారని నివేదిక తెలిపింది. అపార్ట్ మెంట్ లో మొత్తం 70 మంది ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్యను ధృవీకరించాల్సి వుందని వెల్లడించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపింది.










