అనంతపురం : అనంతపురంలోని శ్రీకంఠం సర్కిల్ సమీపంలో ఉన్న ఐడీ బీఐ ప్రైవేట్ బ్యాంకులో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం బ్యాంకు సిబ్బంది వచ్చేటప్పటికి సామాగ్రి రికార్డులన్నీ కాలిపోయినట్లు వారు తెలిపారు. రాత్రి షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని ఫైర్ పోలీసులు అంచనా వేశారు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం సంభవించలేదని చెప్పారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని సమయానికి మంటలను అదుపు చేశారు. అర్థరాత్రి ఎవరూ లేని సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో ఫైల్స్, ఫర్నీచర్ పూర్తిగా దగ్ధం అయినట్టు సమాచారం. ఫైర్ అలారం ఉన్న కుడా పని చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.