
బెంగళూరు : బెంగళూర్‌లో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలు ప్రైవేట్ బస్సులు దగ్ధమయ్యాయి. వీరభద్రనగర్‌లోని ఓ పార్కింగ్ స్ధలంలో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సుమారు ఆరు బస్సులు దగ్ధమైనట్లు అధికారులు వెల్లడించారు. ఘటనా స్ధలానికి అగ్నిమాపక యంత్రాలు చేరుకున్నాయని, మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించిందని అన్నారు. గ్యారేజీలో చెలరేగిన మంటలు బస్సులకు అంటుకుని ఉంటాయని అనుమానిస్తున్నారు. అయితే ఈ ప్రమాద విచారణ చేపట్టాల్సి ఉందని అధికారులు తెలిపారు.