Jan 27,2023 15:13

ప్రజాశక్తి - కశింకోట : పశువులు, జంతువులు అప్యాయత చూడాలి అని కశింకోట పశు వైద్య అధికారి అల్పహన్స్ జార్జ్ అన్నారు. జంతు సంరక్షణ పక్షోత్సవాలు సందర్భంగా వేణుగోపాల స్వామి ఆలయం వద్ద గోసాలపలో ఉచిత పశు వైద్య శిబిరం శుక్రవారం ఏర్పాటు చేయడం జరిగినది. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రతి రైతు సకాలంలో పశు, జంతు సంరక్షణ చూడాలని చెప్పారు ఈ సందర్భంగా పశువుల్లో గర్భ కోస వ్యాధులు పరీక్షించి మందులు ఇవ్వడం జరిగింది. అలాగే పేయ్యలకు నట్టల నివారణ మందు మరియు విటమిన్ ఇంజక్షన్ చేయడం జరిగింది. శ్రీ రాజేటి మారుతి వెంకటాచారి సహయ పశు వైద్య సిబ్బంది రైతులు పాల్గొన్నారు మరియు సిబ్బంది పాల్గొన్నారు.