Mar 02,2023 17:45

ముంబయి  :  దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం మరోసారి నష్టాల్లో ముగిశాయి. గ్లోబల్‌ ఈక్విటీలలో బలహీనత, నిరంతర విదేశీ నిధుల ప్రవాహం వంటి ప్రతికూల అంశాలతో స్టాక్‌ మార్కెట్లు 1 శాతం క్షీణించాయి.   సెన్సెక్స్‌ 501.73 పాయింట్లు లేదా 0.84 శాతం పతనమై 58,909 వద్ద స్థిరపడింది. రోజులో 544.82 పాయింట్లు తగ్గి 58,866 దగ్గర కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 129 పాయింట్లు లేదా 0.74 శాతం క్షీణించి 17,321.90 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.55 దగ్గర నిలిచింది.

సెన్సెక్స్‌ కింద మారుతి, యాక్సిస్‌ బ్యాంక్‌, టిసిఎస్‌, నెస్లె, ఇన్ఫోసిస్‌, మహీంద్ర అండ్‌ మహీంద్ర, టెక్‌ మహీంద్ర, భారతి ఎయిర్‌టెల్‌లు నష్టపోయాయి. పవర్‌గ్రిడ్‌, సన్‌ ఫార్మా, హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌, లార్సెన్‌ అండ్‌ టర్బో, అల్ట్రా టెక్‌ సిమెంట్‌ లాభపడ్డాయి.