ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. గత రెండు, మూడు సెషన్‌లలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న సూచీలు నేడు స్వల్పంగా లాభపడ్డాయి. మునుపటి రోజు ముగింపుతో పోలిస్తే 0.3-0.4 శాతం ఎక్కువగా ఉన్నాయి. శుక్రవారం ప్రారంభ సెషన్‌లో సెన్సెక్స్ 303 పాయింట్ల లాభంతో 65,543 వద్ద.. నిఫ్టీ 101 పాయింట్ల లాభంతో 19,483 వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా, ఆటో రంగాలు మినహా మిగిలిన నిఫ్టీ అన్ని రంగాల సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆగస్టులో ఇప్పటివరకు రూ. 2,250 కోట్ల విలువైన స్టాక్‌లను విక్రయించినట్లు సమాచారం. విదేశీ పెట్టుబడిదారులు అమ్మకాలు కొనసాగించవచ్చు, లేదా కొనుగోళ్లకు దూరంగా ఉండవచ్చు అని ఆర్థిక నిపుణులు వి.కె. విజరుకుమార్ తెలిపారు.










