Jul 03,2023 14:47

ముంబయి  :   దేశీయ  స్టాక్‌ మార్కెట్లు వరుస లాభాల్లో కొనసాగుతున్నాయి.  గతవారం రికార్డు స్థాయికి దూసుకువెళ్లిన స్థాక్‌ మార్కెట్‌ సూచీలు .. ఈ వారం కూడా అదే పంథాలో కొనసాగుతున్నాయి. తాజాగా సోమవారం సెన్సెక్స్‌ మొదటిసారిగా 65,000 మైలురాయిని దాటగా, నిఫ్టీ కూడా 19,000ను దాటి సరికొత్త రికార్డును సృష్టించాయి. ఫెడరల్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను 500 బేసిన్‌ పాయింట్లకు పెంచినప్పటికీ,   ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు ముఖ్యంగా అమెరికా ఆర్థిక వృద్ధి ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 2 శాతం వృద్ధిని సాధించడం, అనూహ్యంగా మాంద్యం నుండి బయటపడటంతో మార్కెట్లు పుంజుకున్నాయని ఆర్థిక నిపుణులు వికె.విజరు కుమార్‌ పేర్కొన్నారు. హెచ్‌డిఎఫ్‌సి మరియు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులను విలీనం చేయడం కొనుగోళ్లకు మరింత ఊతమిచ్చిందని అన్నారు.
మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, మారుతి సుజుకీ, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, బజాజ్‌ ఆటో, హీరో మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌ స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.