Jul 17,2023 14:35

ముంబయి :    స్టాక్‌ మార్కెట్లు సోమవారం ప్రారంభ ట్రేడ్‌లో లాభాల్లో కొనసాగాయి. విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరగడం, ఐటి విక్రయాలు పెరగడంతో సెన్సెక్స్‌, నిఫ్టీలు జీవిత కాల గరిష్టాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 128.6 పాయింట్లకు పెరిగి రూ.66,189 వద్ద జీవన కాల గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 47.65 పాయింట్లు పెరిగి రూ.19,612 వద్ద గరిష్టంగా నమోదైంది. సెన్సెక్స్‌ కింద విప్రో, టెక్‌ మహీంద్రా, పవర్‌ గ్రిడ్‌, ఇన్ఫోసిస్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌, హెచ్‌సిఎల్‌, టెక్నాలజీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రా టెక్‌ సిమెంట్‌ లాభాల్లో కొనసాగాయి. ఐసిఐసిఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌, లార్సెన్‌ అండ్‌ టర్బో మరియు టైటాన్‌లు నష్టాలను నమోదు చేశాయి. ఎక్సేంజ్‌ డేటా సమాచారం ప్రకారం.. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐఎస్‌)లు శుక్రవారం రూ. 2,636 విలువ కలిగిన ఈక్విటీలను కొనుగోలు చేశారు.