Mar 13,2023 15:00

ముంబయి :   దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సానుకూల పెట్టుబడిదారుల సెంటిమెంట్లు, మిశ్రమ అంతర్జాతీయ సూచనల మధ్య దేశీయ సూచీలు ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ 353 పాయింట్ల లాభంతో 59,488 దగ్గర ట్రేడవుతుండగా, నిఫ్టీ 106 పాయింట్లు లాభపడి 17,519 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.80 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టెక్‌ మహీంద్రా, హెచ్‌సిఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టిసిఎస్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, విప్రో, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, టైటన్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.