ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 340 పాయింట్లు నష్టపోయి రూ.58,000 దిగువకు ముగిసింది. అమెరికాలో రెండు అతిపెద్ద బ్యాంకుల మూసివేత ఆందోళనల మధ్య ఐటి, ఆటో మరియు ఫైనాన్స్ సెక్టార్‌కి చెందిన స్టాకులు వరుసగా నాలుగో రోజు క్షీణించాయి. సెన్సెక్స్ 337.66 పాయింట్ల నష్టంతో 57,900.19 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 111 పాయింట్లు నష్టపోయి 17,043.30 దగ్గర ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.48 దగ్గర నిలిచింది.
సెన్సెక్స్ 30 సూచీలో ఎంఅండ్ ఎం అత్యధికంగా నష్టపోగా, టిసిఎస్, బజాజ్, ఫైనాన్స్, విప్రో, కోటక్, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్, టాటా మోటార్స్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. టైటన్, భారతీ ఎయిర్‌టెల్, ఎల్‌అండ్‌టీ, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.










