ముంబయి : అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 1 శాతం పైగా క్షీణించాయి. సెన్సెక్స్ 730.17 పాయింట్లు నష్టపోయి రూ.59,076 వద్ద ట్రేడవగా, నిఫ్టీ 201.05 పాయింట్లు నష్టంతో రూ. 17,388 వద్ద కొనసాగుతోంది. బలహీనమైన ఆసియా మార్కెట్లు, ఆర్థిక, బ్యాంకింగ్, ఐటి షేర్లలో భారీ అమ్మకాలు జరగడం, అమెరికా మార్కెట్‌లో నష్టాలతో సూచీల్లో క్షీణత నమోదైందని ఆర్థిక విశ్లేషకులు పేర్కొన్నారు డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.07 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.










