ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. వరుసగా నాలుగు రోజుల పాటు నష్టాల్లో కొనసాగుతున్న సూచీలు శుక్రవారం పుంజుకున్నాయి. ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్ 350 పాయింట్ల లాభంతో సానుకూల సూచనలివ్వడంతో అమెరికా, ఐరోపా బ్యాంకుల పతనాలపై ఆందోళనలను కొంత మేర తగ్గించాయి. సెన్సెక్స్ 30 సూచీ 352.26 పాయింట్లు లాభంతో రూ.57,987 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 124 పాయింట్ల లాభంతో రూ.17,109 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.54 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో టిసిఎస్, భారతీ ఎయిర్‌టెల్, సన్‌ఫార్మా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ షేర్లు అత్యధికంగా లాభాల జాబితాలో ఉన్నాయి.










