ముంబయి : స్టాక్ మార్కెట్‌లో గురువారం ప్రారంభంలోనే క్షీణత నమోదైంది. సెన్సెక్స్ 149.95 పాయింట్లు నష్టపోయి రూ.60,198 వద్ద ట్రేడవగా, నిఫ్టీ 29.75 పాయింట్లు నష్టపోయి రూ. 17,724 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌లోని రిలయన్స్, టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి, సహా 17 విభాగాలు నష్టపోయాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.81.89గా కొనసాగుతోంది. ఆసియా మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తుండగా, విదేశీ మార్కెట్లలో క్షీణత నమోదైంది.










