Mar 06,2023 12:48

ముంబయి  :   అంతర్జాతీయ మార్కెట్‌ నుండి సానుకూల సంకేతాలు అందడంతో .. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 525 పాయింట్ల లాభంతో 60,363 దగ్గర ట్రేడవగా, నిఫ్టీ 143 పాయింట్లతో 17,737 దగ్గర కొనసాగుతోంది.   నేడు ఆసియా-పసిఫిక్‌ సూచీలు సానుకూలంగా ట్రేడవుతున్నాయి.   డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.79గా ఉంది.   సెన్సెక్స్‌30 సూచీలో హెచ్‌సిఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, టైటన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టిసిఎస్‌, సన్‌ఫార్మా, రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, విప్రో, టిసిఎస్‌, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌, హెచ్‌డిఎఫ్‌సి షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా,  రెండు మాత్రం స్వల్పంగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ద్రవ్యోల్బణం పై ఆందోళనలు తగ్గడంతో యూరోపియన్‌, అమెరికా మార్కెట్లు గతవారం భారీ లాభాలతో ముగించిన సంగతి తెలిసిందే.