Apr 10,2023 13:19

ముంబయి  :  దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో లాభాల్లో నిలిచాయి. సెన్సెక్స్‌ 164.79 పాయింట్ల లాభంతో రూ.59,997 వద్ద ట్రేడవగా, నిఫ్టీ 52.55 పాయింట్ల లాభంతో రూ. 17,651వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు, విదేశీ నిధుల ప్రవాహం కొనసాగుతుండటం సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.86 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా మోటార్స్‌, టైటన్‌, లార్సెన్‌ అండ్‌ టర్బో, ఎన్‌టిపిసి, మహీంద్ర అండ్‌ మహీంద్ర, విప్రో, పవర్‌ గ్రిడ్‌, టాటాస్టీల్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, టాటా కన్స్‌ల్టెన్సీ సర్వీసెస్‌, హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌ మరియు ఇన్ఫోసిస్‌ లాభాల్లో కొసాగాయి. ఏషియన్‌ పెయింట్స్‌, మారుతీ, బజాజ్‌ ఫైనాన్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, సన్‌ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గతగురువారం అమెరికా మార్కెట్లు సానుకూలంగా ముగిసిన సంగతి తెలిసిందే.