Mar 27,2023 13:35

ముంబయి  :   దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం కొంతమేర లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా-పసిఫిక్‌ సూచీలు మిశ్రమంగా కొనసాగుతుండగా, అమెరికా ఫ్యూచర్స్‌ స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 137.55 పాయింట్లు లాభపడి రూ.57,664 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 46.05 పాయింట్లతో రూ. 16,991వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏడు పైసలు పెరిగి రూ.82.33 దగ్గర నిలిచింది. సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌ గ్రిడ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ఫార్మా, మారుతీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టాటా స్టీల్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎంఅండ్‌ఎం, టైటన్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటిసి, హెచ్‌యూఎల్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.