ఢిల్లీ : రాజ్యాంగ పీఠిక నుండి సెక్యులర్, సోషలిస్ట్ పదాలు తొలగించారని కాంగ్రెస్ ఎంపి అధిర్ రంజన్ చౌదరి అన్నారు. మంగళవారం ఎంపిలకు అందజేసిన రాజ్యాంగం యొక్క కొత్త కాపీల్లో ఆ పదాలు లేవని తెలిపారు. సామ్యవాదం(సోషలిస్టు), లౌకికవాదం(సెక్యూలర్) పదాలు.. రాజ్యాంగ పీఠికలో లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సం సందర్భంగా జరిగిన సమావేశాల సమయంలో.. ఎంపీలకు కొత్త రాజ్యాంగం పుస్తకాలను అందజేసిన విషయం విదితమే. 1976లో రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులర్, సోషలిస్ట్ పదాలను పీఠికలో చేర్చామన్నారు. కానీ ఇప్పుడు ఉన్న రాజ్యాంగ పుస్తకంలో ఆ పదాలు లేకపోవడంతో ప్రభుత్వం ఉద్దేశం అనుమానాస్పదంగా ఉందన్నారు. ఈ అంశాన్ని లేవనెత్తాలని చూశానని, కానీ తన అభ్యర్థనను పట్టించుకోలేదని ఆయన అన్నారు.










