Apr 17,2023 21:12

ముంబయి : అదాని కంపెనీలకు ప్రభుత్వ రంగ రెగ్యూలేటరీ సంస్థలు వత్తాసు పలుకుతున్నాయని మరోసారి రుజువు అయ్యింది. దీనికి నిదర్శనం.. అదాని ఎంటర్‌ప్రైజెస్‌ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పిఒ) చందాదారుల వివరాలు లేవని సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజీ బోర్డు ఆఫ్‌ ఇండియా (సెబీ) చెప్పడమే. అదాని ఎఫ్‌పిఒలో పాల్గన్న చందాదారుల వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద ప్రసంజిత్‌ బోస్‌ అనే వ్యక్తి జనవరి 31, ఫిబ్రవరి 8న రెండు సార్లు సెబీకి దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమాచారాన్ని ఇవ్వడానికి చీఫ్‌ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ (సిపిఐఒ) నిరాకరించారు. సెబీ వద్ద దానికి సంబంధించిన సమాచారం లేదని తెలిపారు. ఆదాని ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పిఒకు మూడు రోజుల ముందు అమెరికన్‌ హిండెన్‌బర్గ్‌ సంస్థ అదాని గ్రూపు తీవ్ర ఆర్థిక అక్రమాలకు పాల్పడుతుందని నివేదిక విడుదల చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఎఫ్‌పిఒను అదాని గ్రూపు ముందుకు తీసుకెళ్లినప్పటికీ.. తర్వాత రద్దు చేసుకుంది.