
- ఒపిఎస్ పునరుద్ధరణ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కొత్త పెన్షన్ విధానం (సిపిఎస్) రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానం (ఒపిఎస్) పునరుద్ధరించాలని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌టిఎఫ్‌ఐ) నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం నాడిక్కడ జంతర్ మంతర్‌లో ఐదు డిమాండ్ల సాధన కోసం స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌టిఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో పార్లమెంట్ మార్చ్ నిర్వహించారు. ఎస్‌టిఎఫ్‌ఐ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు కదంతొక్కారు. మోడీ సర్కార్ విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్లకార్డులు చేబూని నినదించారు. ఈ సందర్భంగా ఎస్‌టిఎఫ్‌ఐ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కెసి హరికృష్ణ, సిఎన్ భారతి మాట్లాడుతూ.. విద్యను కార్పొరేటీకరణ, కాషాయీకరణ చేసేందుకు మోడీ సర్కార్ విధానాలు రూపకల్పన చేసిందని విమర్శించారు. నూతన పెన్షన్ విధానానికి భూమికగా ఉను పిఎఫ్‌ఆర్‌డిఎ చట్టాన్ని తక్షణం ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. నూతన ఆర్థిక విధానాల్లో భాగంగా వచ్చిన పెన్షన్ లేని నూతన పెన్షన్ విధానం భవిష్యత్తులో ఉద్యోగులకి ఆర్థిక నష్టానిు ఇస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్‌ఎస్‌డిఎల్‌లో మదుపు చేసిన సొమ్మును తిరిగి రాష్ట్రాలకు చెల్లించబోమని చెప్పటంపై మండిపడ్డారు. సిపిఎస్‌ను రద్దు చేయకుండా రాష్ట్రాలను నియంత్రించే విధంగా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయని విమర్శించారు. రాజ్యాంగ విలువలను, జాతీయ సమైక్యత భావాలను విద్యావిధానం నేర్పాల్సి ఉందన్నారు. విద్య వ్యాపారం చేయటాన్ని, విద్య కేంద్రీకరణ చేయటాన్ని ప్రోత్సహించే జాతీయ విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సిపిఎస్‌ని రద్దు చేసి పాత పెన్షన్ విధానానిు పునరుద్ధరించకపోతే జాతీయ స్థాయిలో ఉద్యమానిు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎస్‌టిఎఫ్‌ఐ జాయింట్ జనరల్ సెక్రటరీ సుకుమార్ పైన్, కోశాధికారి ప్రకాష్ చంద్ర మొహంతి మాట్లాడుతూ డిమాండ్లు నెరవేర్చకుంటే రాష్ట్రపతికి లక్షలాది మంది ఉపాధ్యాయుల సంతకాలతో కూడిన మెమొరాండం అందజేస్తామని స్పష్టం చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చేవరకు దేశవ్యాప్త ఆందోళన కొనసాగిస్తామని ఉపాధ్యాయులు హెచ్చరించారు. ఎస్‌టిఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్.టి.శివరాజన్, మోహన్‌దాస్ పండిట్, ఎస్. మయిల్, మహావీర్ సిహాగ్, బినోద్ బిహారీ పాణిగ్రాహి, చారులత మహపాత్ర, జాతీయ కార్యదర్శి బద్రునిసా, మహ్మద్ అల్లావుద్దీన్, కృష్ణప్రసను భట్టాచార్య, నాగేంద్ర సింగ్, సాయిబల్ రాయ్, ధర్మేంద్ర సింగ్ ఎ. శంకర్ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు యూసఫ్ తరిగామి, జెఎన్ యు ఎస్ యు అధ్యక్షురాలు ఐషీఘోష్ సంఘీభావం తెలిపారు.
ఎపి, తెలంగాణ నాలుగొందల మంది హాజరు
ఎస్‌టిఎఫ్‌ఐ పిలుపు మేరకుపార్లమెంట్ మార్చ్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి యుటిఎఫ్ తరపున 400 మంది ఉపాధ్యాయులు పాల్గనాురు. ఆంధ్రప్రదేశ్ నుంచి యుటిఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షురాలు ఎ.ఎస్ కుసుమకుమారి, రాష్ట్ర కోశాధికారి బి. గోపి మూర్తి, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు పిఎస్ విజయరామరాజు, డి అపర్ణ, ఎం శ్రీలక్ష్మి, సి హెచ్ పట్టాభి రామయ్య, కె. కమల కుమార్, ఎస్. రతురాజు తదితరులు పాల్గనాురు.
- ఎస్‌టిఎఫ్‌ఐ డిమాండ్లు
1. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి)-2020నిరద్దు చేయాలి. అందరికీ ఉచిత, నిర్బంధ, నాణ్యమైన విద్యను అందించాలి.
2. నూతన పెన్షన్ పథకం (ఎన్‌పిఎస్), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఎ) రద్దు, పాత పెన్షన్ పథకం (ఒపిఎస్) అమలు చేయాలి.
3. అనిు తాత్కాలిక, అడ్‌హాక్, కాంట్రాక్ట్, టర్మ్ బేసిస్ టీచర్లు, ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించాలి.
4. విద్యా హక్కు చట్టాన్ని 12వ తరగతి వరకు పొడిగించాలి. ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేయాలి.
5. రూ.7.50 లక్షల ఆదాయం వరకు ఆదాయపు పనుు మినహాయింపు ఇవ్వాలి. రూ.2.5 లక్షల వరకు స్టాండర్డ్ డిటెక్షన్ ఉండాలి. 80 సిసి మినహాయింపు రూ.3 లక్షల వరకు ఉండాలి.



