![](/sites/default/files/2023-11/fishers%20protest.jpg)
విశాఖపట్నం : ప్రభుత్వం తమను తక్షణమే ఆదుకోవాలని, నష్టపరిహారాన్ని ప్రకటించాలని... విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారులంతా బైఠాయించి నిరసన చేపట్టారు. ఆదివారం రాత్రి విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద అగ్నిప్రమాదం సంభవించి 40 బోట్లు దగ్ధమైన సంగతి విదితమే. సోమవారం ఉదయం మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని.. వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిఎం జగన్ ఈరోజు సాయంత్రంలోపు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరారు. బోటుకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.