Nov 18,2023 17:59

న్యూఢిల్లీ : రేపు (నవంబర్‌ 19) ఢిల్లీలో డ్రై డే పాటించాలని ఆప్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో.. ఢిల్లీ ప్రభుత్వం డ్రై డే పాటించాలని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ నిర్ణయం ప్రకటించడం గల కారణం మ్యాచ్‌ మాత్రం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రేపు రాజధాని నగరంలో ఛట్‌పూజ నిర్వహించనున్నారు. ఈ పూజ సందర్భంగా సూర్యదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ నేపథ్యంలోనే మద్యం అమ్మకాలను ఆదివారం రోజు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ కిషన్‌ మోహన్‌ ఆదేశాలు జారీ చేశారు.