న్యూఢిల్లీ: దేశరాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్), ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. ఈ ప్రాంతంలో ఈ నెల 3న తీవ్ర భూప్రకంపనలు రాగా.. తాజాగా ఆదివారం మళ్లీ భూప్రకంపనలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. మధ్యాహ్నం సమయంలో ఢిల్లీ- ఎన్‌సిఆర్ పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు భూమి బలంగా కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సాయంత్రం 4.08గంటల సమయంలో హర్యానాలోని ఫరీదాబాద్‌లో భూకంప తీవ్రత రిక్టర్‌స్కేలుపై 3.1గా నమోదైనట్టు జాతీయ భూకంప కేంద్రం పేర్కొంది.