ఢిల్లీ : ఇజ్రాయెల్ -పాలస్తీనా మధ్య భీకరంగా యుద్ధం కొనసాగుతోంది. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. మంగళవారం ఉదయం నుంచి ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ విషయమై ఓ అధికారి మాట్లాడుతూ.. న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం, సెంట్రల్ ఢిల్లీలోని చాందినీ చౌక్‌లోని చాబాద్ హౌస్ చుట్టూ మోహరించిన స్థానిక పోలీసులను కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. అలాగే న్యూఢిల్లీలోని పహర్‌గంజ్ ప్రాంతంలోని యూదుల మత స్థలం చాబాద్ హౌస్ దగ్గర కూడా భద్రతను పెంచినట్లు తెలిపారు.